ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితం ఒక అబద్దాల నిఘంటువు అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. అందులో బడ్జెట్ లెక్కలు ఎంతని అన్నారు. తారుమారు మానిప్యులేషన్స్ సూత్రధారి చంద్రబాబు అని పేర్కొన్నారు. మోసాలకు మోసం.. నేరాలకు చిరునామా.. పాపాలకు నిలయం చంద్రబాబు జీవితం అని అన్నారు. వెన్నుపోటు రాజకీయాల ఆద్యుడు అంటూ చంద్రబాబును పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే నిఘంటువులో పదాలు కూడా చాలవు అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు.