Homeహైదరాబాద్latest Newsఉపాధి హామీ పనుల పరిశీలిన

ఉపాధి హామీ పనుల పరిశీలిన

ఇదేనిజం, వేమనపల్లి : వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న చిన్న నీటి కుంట పనులను జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్త రావుతో కలిసి పరిశీలించారు. మస్టర్ వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూలీలందరూ గరిష్ట వేతనం రూ.300 పొందేలా కొలతల ప్రకారం పని చేయాలని సూచించారు. వారు చేస్తున్న పని పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పని ప్రదేశం వద్ద తాగునీరు, షెడ్, మెడికల్ కిట్ లు వినియోగించుకోవాలన్నారు. ఎండలు ఎక్కవగా ఉన్న కారణంగా కూలీలు ఉదయమే వచ్చి 10 గంటలకు వరకు పని పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ దేవేందర్ రెడ్డి, ఏపిఓ సత్య ప్రసాద్, ఈసీ మధుకర్, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకుడు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img