Homeఫ్లాష్ ఫ్లాష్అమెరికా కాబోయే ప్రెసిడెంట్‌ జో బైడెన్‌కు చెన్నై మూలాలు

అమెరికా కాబోయే ప్రెసిడెంట్‌ జో బైడెన్‌కు చెన్నై మూలాలు

వాషింగ్టన్‌ : అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హారిస్ చెన్నైతో ఉన్న అనుబంధం తెలిసిందే.

ఇప్పుడు అమెరికా కాబోయే ప్రెసిడెంట్‌ జో బైడెన్‌కు సైతం చెన్నైలోనే త‌న పూర్వీకుల మూలాలున్నాయి.

లండన్‌లోని కింగ్స్ కాలేజీ విజిటింగ్ ప్రొఫెసర్ టిమ్ విల్లాసే-విల్సే ఇదే విష‌యాన్ని ప‌క్కా ఆధారాల‌తో చెబుతోంది.

ఈ విషయాలను టిమ్‌ విల్లాసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ప్రచురణలో ఒక వ్యాసంలో రాశారు. దాని ప్ర‌కారం..

జో బైడెన్ పూర్వీకులు క్రిస్టోఫర్, విలియం బైడెన్ సోదరులు 19 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఓడ‌ల్లో పనిచేశారు.

విలియం చిన్న వయస్సులోనే మరణించగా, క్రిస్టోఫర్ తన సేవలో అనేక ఓడలకు కెప్టెన్‌గా పనిచేసి చివరాంకంలో మద్రాసులో స్థిరపడ్డారు.

జో బైడెన్ సైతం ఇండియాతో త‌న‌కున్న అనుబంధాన్ని కొన్ని సందార్భాల్లో స్వ‌యంగా తెలియ‌జేశారు.

2013 లో ముంబై పర్యటన సందర్భంగా తన ముత్తాత తాతలు ముంబైలో నివసించారని తనకు ఐదు దశాబ్దాల క్రితం అందిన లేఖ ద్వారా తెలిసిందని చాలా సార్లు బైడెన్‌ చెప్పారు.

Recent

- Advertisment -spot_img