HomeసినిమాChhatrapati re-release on 23rd of this month ఈ నెల 23న ఛత్రపతి రీ...

Chhatrapati re-release on 23rd of this month ఈ నెల 23న ఛత్రపతి రీ రిలీజ్

టాలీవుడ్​లో ప్రస్తుతం రీ రిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్​ బాబు, పవన్ కల్యాణ్ సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్​ అయి థియేటర్లలో సందడి చేశాయి. అయితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యోగి సినిమాను సైతం రీ రిలీజ్​ కాగా.. ఆడియెన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ దక్కలేదు. ఇప్పుడు ప్రభాస్​ బర్త్ డే కానుకగా ‘ఛత్రపతి’ సినిమాను రీ రిలీజ్​ చేసేందుకు ఆ మూవీ నిర్మాతలు సిద్ధమయ్యారు. ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన మొదటి సినిమా ఛత్రపతి. 2005లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకుని ప్రభాస్​కు సరికొత్త స్టార్​డమ్​ను తెచ్చిపెట్టింది. అయితే, ఈ సినిమాను ఈ నెల 23న 4కేలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. విజయేంద్ర వర్మ కథను అందించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’సినిమా డిసెంబర్​లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈలోగా ఛత్రపతి రీ రిలీజ్​ అవుతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్​ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img