Homeహైదరాబాద్latest Newsవీధి కుక్కల దాడిలో బలవుతున్న పిల్లలు వృద్ధులు.. చర్యలు ఏవి..?

వీధి కుక్కల దాడిలో బలవుతున్న పిల్లలు వృద్ధులు.. చర్యలు ఏవి..?

బాల్యం నాలుగు గోడల మధ్య బంది అవ్వాల్సిందేనా.. లేదా బజారులో పసిప్రాణాలు శునకాలకు బలి అవ్వాల్సిందేనా. గత సంవత్సర కాలంగా శునకాలకు బలవుతున్న పసిపిల్లల ఘటనలు చాల ఉన్న ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కావట్లేదు. విశ్వాస జంతువులు విషాదాలను మిగులుస్తున్నాయి. పల్లెల్లో వీధి కుక్కల భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు ప్రజలపై ఎగబడటంతో జనాలు జంకుతున్నారు. గత ఏడాది హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడి పై వీధి కుక్కలు దాడి చేసి క్రూరంగా చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. మరోఘటన చూసుకుంటే స్వాతంత్ర్య వేడుకల్లో రోడ్డు పై మార్చ్ నిర్వహించడానికి వెళుతున్న బాలుడిపై దాడికి దిగగా తప్పించుకునే క్రమంలో ప్రక్కన ఉన్న వాహనం ఢీ కొట్టాడంతో మరణించాడు. తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కలు స్వ్వైర విహారం చేసిన ఘటనలు కొకొల్లలు.

వేసవి సెలవులు వస్తుండటంతో.. పరేషాన్లో తల్లిదండ్రులు
ఈ నెల 25 వ తేదితో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మొదలవుతున్నాయి. సెలవుల్లో ఇంటి ముందు, వీధుల్లో ఆట విడుపుకు పంపాలంటే జంకుతున్నారు. పల్లెల్లో శునకాల దాడులు నిత్యం జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అత్యధిక కేసులతో ఆత్మకూర్ లో..
జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదైన కేసుల్లో 90%శాతం కేసులు ఆత్మకూర్, ఆత్మనగర్ గ్రామాల నుండి నమోదైనట్లు ఆరోగ్య కేంద్రం సిబ్బంది తెలుపుతున్నారు. ఒకే రోజు 12 మంది పై శూనకాలు విరుచుకుపడ్డ సంఘటన వివరాలు సిబ్బంది తెలిపారు. ఇంత జరుగుతున్న నివారణ చర్యలు చేపట్టకపోవడంతో.. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా అన్న ప్రశ్నలు తేలేత్తుత్తున్నాయి. గ్రామాల్లో శూనకాలను చంపితే తప్పు.. చంపకపోతే ముప్పు అవ్వడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మూగ జీవుల ప్రాణం విలువ గురించి ప్రశ్నించే వారు పసిపిల్లల ప్రాణాలు కనిపించవ అంటూ నేటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

వాహానల పై వెళ్లే వారిపై దాడి..
మండల కేంద్రం నుండి ఆత్మకూర్ వెళ్లే మార్గంలో వెల్లుల్ల, రాంచంద్రంపేట్, జగ్గాసాగర్ గ్రామాలు చీకటి అయితే దాటుతూ వెళ్ళాలంటే ఆందోళన చెందుతున్నారు. బైక్ లపై వెళ్ళేవారిపై వెంబడిస్తూ దాడి చేస్తూన్నాయి.

Recent

- Advertisment -spot_img