Homeఫ్లాష్ ఫ్లాష్#ChildrensDay : 18 ఏళ్లకే కోటీశ్వరుడు కావాలా.. ఇలా చేయండి

#ChildrensDay : 18 ఏళ్లకే కోటీశ్వరుడు కావాలా.. ఇలా చేయండి

హైద‌రాబాద్ః తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మన దేశంలో నవంబర్ 14 న పిల్లల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల పేరుమీద పెట్టుబడి పెడితే వారు 18 ఏళ్ల‌కు చేరుకునే లోపు వారు కోటీశ్వ‌రులు అయ్యేందుకు అవ‌కాశం ఉంది.

మీ పిల్లల ఉన్న‌త చ‌దువు అవ‌స‌రాల‌కు, ఇత‌ర అవ‌స‌రాల‌కు ఆ డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సింద‌ల్లా మ్యూచువల్ ఫండ్స్ ల‌లో పెట్టుబడి పెట్టాలి.

పిల్లల పేరిట మ్యూచువల్ ఫండ్ పొందాలంటే పిల్లల భ‌ర్త్ స‌ర్టిఫికేట్‌ అవసరం. వీటితో పాటు, అతని పేరెంట్స్ ఐడీ ప్రూఫ్స్ అవ‌స‌రం ప‌డ‌తాయి.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌(సిప్‌) పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమైన మార్గంగా నిపుణులు చెబుతారు.

బిడ్డ పుట్టిన వెంటనే అతను తన పేరు మీద నెలకు రూ .5 వేలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ప్రతి సంవత్సరం ఈ పెట్టుబడిని 15 శాతం పెంచడం కొనసాగించండి.

ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిపై మీకు 12% రాబడి లభిస్తే, 18 సంవత్సరాలలో పిల్లలు కోటీశ్వరుడు అవుతాడని మ్యూచువ‌ల్ ఫండ్ నిపుణులు లెక్క క‌డుతున్నారు.

గ‌మ‌నికః ఈ క‌థ‌నం కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. మ్యూచువ‌ల్ ఫండ్‌లో పెట్టుబ‌డి పెట్టేముందు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలి.

Recent

- Advertisment -spot_img