Homeఅంతర్జాతీయంఅణ్వాయుధ సంప‌త్తి పెంపు దిశ‌గా చైనా

అణ్వాయుధ సంప‌త్తి పెంపు దిశ‌గా చైనా

China is making efforts to increase its nuclear weapons.

This was stated by Hans Christensen, an American weapons expert, via satellite imagery.

In the basement, China is setting up special launch pads for this purpose.

He said efforts were being made to increase the capability of launching new nuclear missiles.

అణ్వాయుధ సంప‌త్తిని పెంచుకునేందుకు చైనా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది.

ఈ విష‌యాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా అమెరికా ఆయుధ నిపుణుడు హాన్స్‌ క్రిస్టెన్‌సెన్ తెలిపారు.

నేలమాళిగలో చైనా ఇందుకోసం ప్రత్యేకంగా ప్రయోగ వేదికలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు.

వీటి ద్వారా సరికొత్త అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నాలు జరు‌పుతోంద‌ని అన్నారు.

చైనా ఇటీవ‌ల ఒక క్షిపణి శిక్షణ కేంద్రంలో నిర్మాణాలు చేప‌ట్టింది.

అమెరికా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి చైనా మ‌రిన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

చైనాతో పాటు అమెరికా, రష్యా వంటి దేశాల‌ అణ్వస్త్ర ప్రయోగాల‌పై ఆయ‌న చాలా కాలంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఉపగ్రహ చిత్రాలను ప‌రిశీలించి జిలాంటాయ్‌లోని క్షిపణి పరీక్ష వేదిక వద్ద చైనా పాల్ప‌డుతున్న చ‌ర్య‌ల‌ను గుర్తించారు.

నేలమాళిగలో 11 క్షిపణి ప్రయోగ వేదికల నిర్మాణాలను చైనా చేప‌డుతోంద‌ని తెలిపారు.

ఇప్ప‌టికే చైనా వద్ద దాదాపు 20 నేలమాళిగ ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి.

ఇటువంటి ప్రాంతాల్లో  అణ్వ‌స్త్ర‌ క్షిపణులను భద్రపరిస్తే అణ్వస్త్ర దాడిని తట్టుకోవ‌డ‌మే కాకుండా, ప్రతిదాడిని సులువుగా చేయొచ్చ‌న్న చైనా ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందద‌ని చెప్పారు.

అమెరికా, చైనాలకు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యం ఉంది.

చైనా తన ప్రయోగ  వేదికలను మూడు పెంచినప్ప‌టికీ ఆ రెండు దేశాల ముందు అవి ఏ మాత్రం ప‌నికిరావ‌ని చెప్పారు. అమెరికా వద్ద ఇలాంటివి 450 ఉన్నాయని తెలిపారు.

చైనా కొత్తగా నిర్మిస్తున్న నేలమాళిగ సెంట‌ర్లు డీఎఫ్‌-41 అనే ఖండాంతర క్షిపణులను మోహరించడానికి వీలుగా ఉన్నాయ‌ని చెప్పారు.

చైనా, అమెరికా అణ్వస్త్ర చ‌ర్యల వ‌ల్ల ఆయుధ పోటీ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తూ అణ్వాయుధాగారాన్ని నిర్మించేందుకు, త‌మ సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుకునేందుకు అమెరికా కూడా ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది.

Recent

- Advertisment -spot_img