Homeఅంతర్జాతీయంతన పరువును తానే తీసుకున్న చైనా

తన పరువును తానే తీసుకున్న చైనా

హాలీవుడ్‌ క్లిప్‌లతో చైనా వాయసేన ప్రచారం
న్యూఢిల్లీ: జిత్తులమారి చైనాకు మరో కుయుక్తి బయటపడటంతో ప్రపంచ మీడియాలో అభాసుపాలయ్యింది. ఇండియా, తైవాన్​తోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలతో చైనా కిరికిరి పెట్టుకుంటుంది. తరచూ ఈ దేశాలతో మాటల యుద్ధం చేస్తోంది. ఇతర దేశాలను బెదిరించేందుకు చైనా తరచూ తన శక్తి సామర్థ్యాలపై ప్రగల్భాలు చెప్పుకునేందుకు ఏవో వీడియోలు రిలీజ్​ చేస్తోంది. తాజాతా చైనా తన వైమానిక శక్తిని తెలియజేస్తూ ఆ దేశ వాయుసేన విడుదల చేసిన వీడియో రిలీజ్​ చేసింది. కానీ ఇక్కడే చైనా అతి తెలివి అభాసుపాలయ్యింది. చైనా వాయుసేన విడుదల చేసిన వీడియోలో హాలీవుడ్​ సిమాల క్లిప్పింగులను చేర్చినట్లు హాంగ్‌కాంగ్‌కు చెందిన యాపిల్‌ డైలీ హెచ్‌కే సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలైన ‘ట్రాన్స్‌ఫార్మర్స్: రివెంజ్‌ ఆఫ్‌ ది ఫాలెన్‌’, ‘ది హర్ట్‌ లాకర్‌’ సినిమాల దృశ్యాలను కాపీ కొట్టినట్లు తేల్చింది. చైనా వాయుసేన వీడియోలో దృశ్యాలను.. సినిమాలోని దృశ్యాలను మ్యాచ్​ చేస్తూ తన ట్విటర్​ అకౌంట్​లో ఫోటోలను రిలీజ్​ చేసింది.

https://twitter.com/appledaily_hk/status/1307726213641764865

Recent

- Advertisment -spot_img