Homeహైదరాబాద్latest Newsముఖం కోసిన చైనా మాంజా

ముఖం కోసిన చైనా మాంజా

ఇదేనిజం, మల్కాజ్​గిరి: పతంకులు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఇప్పటికే చైనా మాంజాలతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా చైనా మాంజా ఓ వ్యక్తి ముఖం కోసేసింది. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తికి మాంజా తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నేరేడ్​ మెంట్ పీఎస్​ పరిధిలో చోటు చేసుకున్నది. షేక్​ పేటకు చెందిన అబ్దుల్ హక్ (37) ద్విచక్ర వాహనంపై కాప్రాకు వెళ్తుండగా.. నేరేడ్​ మెంట్ చౌరస్తాలో మాంజా ముఖానికి తగిలి కోయగా గాయమైంది. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img