Homeఅంతర్జాతీయంChina : స్వీయ రక్షణ కోసమే అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం

China : స్వీయ రక్షణ కోసమే అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం

China : స్వీయ రక్షణ కోసమే అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం

China : అణ్వాయుధాల విషయమై చైనా రక్షణ మంత్రి వీఫెంగే కీలక ప్రకటన చేశారు.

కొత్త తరహా అణ్వాయుధాల అభివృద్ధిలో చైనా ఎంతో ప్రగతి సాధించినట్టు చెప్పారు.

కాకపోతే అణ్వాయుధాలను చైనా తన స్వీయ రక్షణ కోసమే ఉపయోగిస్తుందని చెప్పారు.

అంతేకానీ, ముందుగా చైనా అణ్వస్త్రాలను ప్రయోగించదని స్పష్టం చేశారు.

చైనా తూర్పు భాగంలో గతేడాది 100కు పైగా అణు క్షిపణీ ప్రయోగ కేంద్రాలను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా..

చైనా రక్షణ కోసం అణ్వస్త్ర సామర్థ్యాల అభివృద్ధికి సరైన మార్గాన్ని ఎప్పుడూ అనుసరిస్తుందని వీఫెంగే స్పష్టం చేశారు.

‘‘చైనా ఐదు దశాబ్దాల కాలంలో తన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంది.

ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించామని చెప్పడం వాస్తవం. విధానం అన్నది స్థిరమైనది.

మేము మా రక్షణ కోసమే వాడతాం. అణ్వాయుధాలను ముందుగా మేము ప్రయోగించం’’అని వీఫెంగే పేర్కొన్నారు.

చైనా అణ్వాయుధ సంపత్తి అన్నది అంతిమంగా అణు యుద్ధాన్ని నివారించేందుకునేని చెప్పారు.

Recent

- Advertisment -spot_img