Homeసినిమాచిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం' టీజర్‌ విడుదల

చిరంజీవి చేతుల మీదుగా ‘విరాటపర్వం’ టీజర్‌ విడుదల

Chiranjeevi unveils the teaser of Rana Daggubati and Sai Pallavi's 'Virata  Parvam' - The Hindu

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విరాటపర్వం.

యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి  వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు.

గురువారం ఈ సినిమా టీజర్‌ను  మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు.

వాస్తవ కథకు దగ్గరగా, ఎంతో రియలిస్టిక్‌గా టీజర్‌ ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

1990ల నాటి విప్లవ కథ ఆథారంగా సినిమా తెరకెక్కుతుంది. టీజర్ ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు.

‘ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్ని నాళ్లు?తారతమ్య గోడలనే పికిలించగ ఎన్నినాళ్లు?దున్నేటోడి వెన్ను విడిచి భూస్వాములు ధనికులైరి’ అనే రానా కవిత్వంతో టీజర్‌ మొదలవుతుంది.

ఈ చిత్రంలో రానా.. డాక్టర్ రవి శంకర్ నుంచి రవన్న అలియాస్ అరణ్యగా ఎందుకు మారాడనేదే  స్టోరీ.

అరణ్యను ఇష్టపడే వెన్నెల పాత్రల సాయి పల్లవి నటించింది.

అతని కవిత్వానికి ప్రేరణ చెంది నక్సలైట్‌గా మారే అమాయక యువతి పాత్రలో సాయి పల్లవి నటించింది.

ఇక ఈ చిత్రంలో భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

అలాగే  నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తునన్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది.

Director Venu Udugula’s Virata Parvam is among the most awaited Telugu films this summer.

Starring Rana Daggubati, Sai Pallavi, Nandita Das, Priyamani and Easwari Rao among others, the film narrates a story inspired by true events in the 1990s.

The teaser of the film, which is scheduled to release in theatres on April 30, was unveiled by actor Chiranjeevi.

The teaser shows glimpses into the world of a rebellion and a love story that took place in Telangana in the 90s.

Rana plays a character who inspires people to wage a battle for their rights, against oppression, and Sai Pallavi as a young woman who gets inspired by his writings.

Produced by Suresh Productions and SLV Cinemas, the film’s crew includes cinematographers Divakar Mani and Dani Salo, music composer Suresh Bobbili and editor Sreekar Prasad.

 

Recent

- Advertisment -spot_img