Homeసినిమాచిరు గుండుపై పేలుతున్న‌ ఫ‌న్నీ జోకులు

చిరు గుండుపై పేలుతున్న‌ ఫ‌న్నీ జోకులు

హైదరాబాద్: హీరో చిరంజీవి గుండుతో ఉన్న‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే ఆయ‌న గుండు ఫోటోకు నెటిజ‌న్ల నుంచి విప‌రీతంగా కామెంట్లు వ‌స్తున్నాయి. ఇందులో ఫ‌న్సీ కామెంట్స్ ఎక్కువ‌గా ఉన్నాయి. ముఖ్యంగా లలితా జ్యూవ‌ల్ల‌ర్స్ అధినేత కిర‌ణ్ కుమార్‌తో చిరు గుండును పోల్చుతూ చేసిన కామెంట్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. కిర‌ణ్ గుండుతో చిరు పోటీ ప‌డుతున్నారంటూ ఇద్ద‌రి ఫోటోల‌ను ప‌క్క‌ప‌క్క‌న పెట్టి మ‌రీ కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు ఊరికే రావంటూ డైలాగ్ తో పాటు గుండుతో ఉన్న కిరణ్ కుమార్ స్టైల్ తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే. మ‌రికొంద‌రేమో గుండుదాదా, గుండుబాస్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రం కోస‌మే గుండు గీయించుకున్నారా లేదా అన్న‌దానిపై చిరు నుంచి స్ప‌ష్ట‌త రావాల్సింది ఉంది.

Recent

- Advertisment -spot_img