HomeతెలంగాణChurch Scam : సిద్దిపేటలో అధికారుల మాయాజాలం.. లేని చర్చికి 4 లక్షలు సాంక్షన్​

Church Scam : సిద్దిపేటలో అధికారుల మాయాజాలం.. లేని చర్చికి 4 లక్షలు సాంక్షన్​

Church Scam : సిద్దిపేటలో అధికారుల మాయాజాలం.. లేని చర్చికి 4 లక్షలు సాంక్షన్​

Church Scam : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో అధికారుల మాయాజాలం బయటపడింది. గ్రామంలోని 727 సర్వే నెంబరులో ఎప్పటినుంచో చర్చి ఉందంటూ దాన్ని కూల్చి కొత్త చర్చి కట్టేందుకు అని అధికారులు ఆర్జీదారునికి ఏకంగా 4 లక్షలు ప్రజాధనాన్ని ముట్టజెప్పారు. నిజానికి అక్కడకు వెళ్లి చూస్తే ఆ సర్వే నెంబరులో గడ్డి తప్ప ఏమీ లేదు. పైగా అధికారులు స్థల పరిశీలన జరిపినట్లు దృవీకరించిన పత్రాలలో ఎక్కడో జరుగుతున్న సాదారణ నిర్మాణానికి సంబందించిన పిల్లర్ల నిర్మాణ ఫోటోను జతచేశారు. ఈ మాయాజాలంలో ఏ అధికారి పాత్ర ఎంత అని తెలియనప్పటికీ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్​ వరకు అందరి అనుమతి పత్రాలు ఉన్నాయి. చిన్న కాగితం సరిగా లేకుంటేనే ప్రజలను బయటకు పంపే అధికారులున్న వేళ ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు రావడంతో గ్రామంలో పలువురు ఇంత తతంగం ఎలా జరిగిందంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన జరిపిన అధికారితో పాటు అన్ని రకాల పత్రాలు కింద చూడవచ్చు.

VIEW DOCUMENTS

Recent

- Advertisment -spot_img