Homeహైదరాబాద్latest Newsపార్లమెంట్ రక్షణ బాధ్యత సీఐఎస్‌ఎఫ్‌కు

పార్లమెంట్ రక్షణ బాధ్యత సీఐఎస్‌ఎఫ్‌కు

పార్లమెంటు సెక్యూరిటీ బాధ్యతలు ఇకనుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిర్వర్తించనుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శీతాకాల సమావేశాల్లో అలజడులు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిాంచకుండా 3317 మంది సిబ్బందిని మోహరించనున్నారు.

డీఐజీ ర్యాంకు స్థాయి సీఆర్పీఎఫ్‌ అధికారి శుక్రవారమే(మే 17) కాంప్లెక్స్‌లోని అన్ని సెక్యూరిటీ పాయింట్‌లను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌ (CRPF)కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ (PDG), దిల్లీ పోలీస్‌, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌ (PSS)లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి.

Recent

- Advertisment -spot_img