దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై మాజీ ప్రభుత్వ అధికారి బాల లత ఫైర్ అయ్యారు. ‘‘సివిల్స్‌కు ఎంపిక కావాలంటే అంతగత్తెలు అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. ఆమె మెంటల్ బ్యాలెన్స్ అదుపుతప్పినట్టు ఉంది. వెంటనే సీఎస్ ఆమెకు షోకాజ్ నోటీసులు పంపించాలి’’ అని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి పాలనలో ఈ మాటలేంటి..!
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను పలువురు దివ్యాంగులు ఖండించారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పాలనలో స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను ఐఏఎస్‌ల సంఘం ఖండించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలవాలని కోరారు.