Homeహైదరాబాద్latest Newsఒళ్లు దగ్గరపెట్టుకొని రివ్యూ రాయండి.. ఓ వెబ్​ సైట్​కు హరీశ్​ శంకర్​ వార్నింగ్​

ఒళ్లు దగ్గరపెట్టుకొని రివ్యూ రాయండి.. ఓ వెబ్​ సైట్​కు హరీశ్​ శంకర్​ వార్నింగ్​

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. ఈగల్ సినిమా గురించి నెగిటివ్ రివ్యూలతోపాటు.. మూవీ యూనిట్, డైరెక్టర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్రోల్ చేశారని.. ఆ సైట్ పై హరీష్ శంకర్ విరుచుకుపడ్డారు. ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు.. రాత్రంతా తాగుతూ ఉన్నాడు..కానీ, ఫోటో మాత్రం వేయరు.. ఏదో షాడో ఫోటో వేస్తారు, డొంక తిరుగుడు ఎందుకు.. అది నేనే అని చెప్పొచ్చుగా అని హరీష్ శంకర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నా ఫోటో, పేరు రాసే ధైర్యం లేదు.. దైర్యం ఉంటే నా ఫోటో వేసి రాయండి.. నేను కౌంటరిస్తాను.. సినీ పరిశ్రమ అంటే కేవలం హీరో , దర్శక నిర్మాతలు మాత్రమే కాదు.. సినీ జర్నలిస్టులు కూడా పరిశ్రమలో ఒక భాగమే. మనం మనం కొట్టుకుని, తిట్టుకుని వేరేవాళ్ల ముందు తక్కువ అవ్వడం ఎందుకు. క్రిటిసైజ్ కు.. ట్రోలింగ్ కు తేడా తెలియకుండా పోతుంది అంటూ, సదరు వెబ్ సైట్ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు. సినీ జర్నలిస్టులను ఉద్దేశిస్తూ.., మనం ఒకే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద.. మేం ఈ గట్టు మీద లేపు.. అందరం కలిస్తేనే సినీ పరిశ్రమ అని అన్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. అలాగే రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img