ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘గ్రామాల్లో 10వేల కి.మీ సిమెంట్ డ్రెయిన్లు వేస్తాం. రైతులు పశువుల షెడ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తాం. పేదలకు ఇళ్లు కట్టించి, విద్యుత్, సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటాం. పంచాయతీల అభివృద్ధికి ఇటీవలే రూ.990 కోట్లు విడుదల చేశాం. త్వరలో మరో రూ.1100 కోట్లు రిలీజ్ చేస్తాం’ అని వానపల్లి గ్రామ సభలో సీఎం అన్నారు.