Homeఆంధ్రప్రదేశ్CM Jagan : బాబు పాలనంతా మోసాలే

CM Jagan : బాబు పాలనంతా మోసాలే

– ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు
– వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు
– ఏపీ సీఎం జగన్​

ఇదేనిజం, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు పాలనంతా మోసాల మయమని ఏపీ సీఎం జగన్​ విమర్శించారు. ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని ఫైర్​ అయ్యారు. వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో మోసాలు తప్ప ఏమీ లేవని పేర్కొన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారని ఫైర్​ అయ్యారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ.. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్‌.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్‌మెంట్‌ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

Recent

- Advertisment -spot_img