HomeతెలంగాణCM KCR Letter to Modi : అది ఆపాల‌ని ప్ర‌ధాని మోదీకి కేసీఆర్ లేఖ‌

CM KCR Letter to Modi : అది ఆపాల‌ని ప్ర‌ధాని మోదీకి కేసీఆర్ లేఖ‌

CM KCR Letter to Modi : అది ఆపాల‌ని ప్ర‌ధాని మోదీకి కేసీఆర్ లేఖ‌

CM KCR Letter to Modi – కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞ‌ప్తి చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం లేఖ రాశారు.

4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు.

సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,

కర్ణాటక మరియు తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకభూమిక పోషిస్తున్నదని సీఎం లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా,

2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు.

సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందని,

దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేయదలిచిన జేబిఆర్ఓసి-3, శ్రావన్‌ప‌ల్లి ఓసి, కోయగూడెం ఓసి-3,

కేకే -6 యుజి బ్లాక్‌ల‌ వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వున్నందున వాటి వేలాన్ని నిలిపివేయమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కోరారు.

ఈ బ్లాక్‌ల‌ను సింగరేణికే కేటాయించేలా చూడాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చ‌దవండి

తెలంగాణ ప్రభుత్వంపై ఎన్నికల సంఘం ఆగ్రహం

సూసైడ్‌ మెషీన్‌.. నొప్పిలేకుండా నిమిషంలోనే చావు

త్వ‌ర‌లో ల‌క్ష‌ల అకౌంట్లు బ్యాన్.. మీది అవ్వ‌కూడ‌దంటే

నోటరీ చెల్లుబాటు కాల‌మెంతో తెలుసా.. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌

Recent

- Advertisment -spot_img