Homeతెలంగాణరెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థం : సీఎం కేసీఆర్

రెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ః రాష్ట్రంలో రెవెన్యూ డిపార్టుమెంట్ కొన‌సాగుతుంద‌ని, కేవ‌లం వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను మాత్ర‌మే ర‌ద్దు చేసిన‌ట్లు సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. భ‌ట్టి సూచ‌న‌పై సీఎం స్పందిస్తూ కేవ‌లం వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసిన‌ట్లు చెప్పారు. మిగ‌తా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడున్న వీఆర్‌వో వ్య‌వ‌స్థ అక్ర‌మాల‌కు కేంద్రంగా మారింద‌ని అందుకే ర‌ద్దు చేశామ‌న్నారు. ప్ర‌జా అవ‌స‌రాల‌కు మాత్ర‌మే అసైన్డ్ భూముల‌ను తీసుకుంటున్నార‌ని, ప్రాజెక్టులు, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల నిమిత్త‌మే ప్ర‌భుత్వం భూముల‌ను తీసుకుంటున్న‌ద‌ని సీఎం స‌భ‌లో తెలిపారు.

Recent

- Advertisment -spot_img