Homeతెలంగాణత్వ‌ర‌లోనే రెవెన్యూ శాఖ‌లో ప‌దోన్న‌తులుః కేసీఆర్‌

త్వ‌ర‌లోనే రెవెన్యూ శాఖ‌లో ప‌దోన్న‌తులుః కేసీఆర్‌

హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. త్వ‌ర‌లోనే రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ చేప‌ట్ల‌న‌న్న‌ట్లు సీఎం చెప్పారు. వీలైనంత తొంద‌ర‌గా ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. శనివారం ఆయన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. దీని అమలు కోసం రెవెన్యూ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని రెవెన్యూ ఉద్యోగుల‌కు సీఎం స్ప‌ష్టం చేశారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్నారంటూ ఒక సంద‌ర్భంలో సీఎం వారిని ప్రశసించారు.
నమ్మకం నిలబెట్టుకుంటాం: ట్రెసా
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ట్రెసా ప్రకటించింది. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగింతపై సీఎంకు ట్రెసా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే తిరిగి కొనసాగించాలని సీఎంని ట్రెసా స‌భ్యులు కోరారు. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయాల‌న్నారు. తహసీల్దార్లతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కావాలని కోరగా.. కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

Recent

- Advertisment -spot_img