HomeSocial Mediaస్కిల్ డెవెలప్ మెంట్ పై సీఎం రేవంత్ FOCUS.. యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా..(VIDEO)

స్కిల్ డెవెలప్ మెంట్ పై సీఎం రేవంత్ FOCUS.. యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా..(VIDEO)

సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎంకు ఇదే మొదటి విదేశీ పర్యటన కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంతో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.

దావోస్ పర్యటనలో సీఎం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) చీఫ్ దేబ్‌జనీ ఘోష్‌, ఇతర ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయడంపై వారితో చర్చించారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్.. వివిధ రంగాల్లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో నాణ్యమైన శిక్షణ ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం తమ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాలని నాస్‌కామ్ ప్రతినిధులను కోరారు.

Recent

- Advertisment -spot_img