Homeహైదరాబాద్latest Newsపది రోజులు తెలంగాణకు దూరంగా సీఎం రేవంత్.. ఎందుకో తెల్సా..?

పది రోజులు తెలంగాణకు దూరంగా సీఎం రేవంత్.. ఎందుకో తెల్సా..?

సీఎం రేవంత్‌రెడ్డి  పది రోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన  ఈ రోజు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.  ఆ తర్వాత  ఆదివారం ఉదయం మణిపూర్‌ వెళ్ళి రాహుల్‌గాంధీ  భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరవుతారు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటిస్తారు.  23వ తేదిన తిరిగి హైదరాబాద్ కు వస్తారు.                                                                     

Recent

- Advertisment -spot_img