ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయగా.. ఆ అంశం పెండింగ్ లో ఉంది. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శుక్రవారం యూపీఎస్సీ చైర్మన మనోజ్ సోనీని కలిశారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటూ.. అధికారులు సైతం అధ్యయనం చేస్తున్నారు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్ పీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయి.