అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ఎమ్మెల్యే సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సబిత మండిపడ్డారు. సభ వాయిదా పడిన అనంతరం నిరసన వ్యక్తం చేస్తూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.