తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.