Homeహైదరాబాద్latest Newsహరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌.. రాజీనామా లేఖ అలా ఉండదు..

హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌.. రాజీనామా లేఖ అలా ఉండదు..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్‌రావు మోసం చేయాలనుకున్న ప్రతిసారీ అమరవీరుల స్థూపం గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి అని కౌంటరిచ్చారు. తన మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం.. హరీశ్‌రావు ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తన మామ చెప్పిన సీస పద్యమంతా హరీష్ లేఖలో రాసుకొచ్చారని అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని.. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని అన్నారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావుకి ఇప్పటికీ చెబుతున్నా.. మీ సవాల్‌ని కచ్చితంగా స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తాం అని తెలిపారు. హరీశ్‌రావు రాజీనామా సిద్ధం చేసుకో అంటూ కౌంటర్ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img