Homeహైదరాబాద్latest Newsనిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: అనారోగ్యం భారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎందరో నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడిగాంధీ పేర్కొన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ మియాపూర్ కు చెందిన గాలయ్య గౌడ్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేసుకోగా  మంజూరైన  రూ.60 వేల చెక్కును  ఆయన నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ  మాట్లాడుతూ..  అనారోగ్యంకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎందరో నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా  నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పల్లె మురళీ, కాంగ్రెస్ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img