కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి జనం ఎక్కడంతో స్టేజ్ కుప్ప కూలిపోయింది. దీంతో స్టేజ్ పై ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణ, చినరాజప్ప, జనసేన నేతలు పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కిందపడిపోయిరు.