ప్రజలకు ఉచిత వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నోస్టిక్ వ్యవస్థను ఐదు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వంలో 36 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 134 పరీక్షలను అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు, అవి ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి ఆ సేవలను పునరుద్ధరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.