ఇళయ దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ‘లియో’తమిళనాట అన్ని రికార్డ్లను బ్రేక్ చేస్తోంది. గురువారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విజయ్ యాక్టింగ్, లోకేశ్ స్క్రీన్ ప్లే మాయతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఫ్యాన్స్‌ను అలరించే ఎన్నో సీన్లు సినిమాలో ఉండటంతో తమిళనాడులోని థియేటర్ల వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఓవర్సీస్లోనూ కలెక్షన్లలోనూ లియో దుమ్మురేపుతోంది. నార్త్ అమెరికాలో టాప్ వన్‌లో ‘లియో’ ఉందంటూ పలువురు సినీ విశ్లేషకులు ట్విట్టర్లో పోస్టులు పెడుతుండటంతో విజయ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే రూ.140 కోట్ల వరకు లియో సినిమా రాబట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న లియో సినిమాకు రిలీజ్ రోజున తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా తమిళనాడు ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో చిత్రబృందమంతా ఆనందం వ్యక్తం చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటించింది. అలాగే పార్తిబన్ పాత్రలో విజయ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Collections: Leo First Day Rs. 140 crores..! Collections : Leo ఫస్ట్ డే.. రూ. 140 కోట్లు..!
RELATED ARTICLES