College Fee increase soon : త్వరలో ఫీజుల పెంపు..
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా పలు వృత్తి విద్యాకోర్సుల ట్యూషన్ ఫీజులు(College Fee) వచ్చే విద్యాసంవత్సరం నుంచి పెరుగనున్నాయి.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, సభ్యులు.. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, మైనింగ్, సైబర్ సెక్యూరిటీ కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో పలు ప్రైవేటు కాలేజీలు ఫీజులు పెంచాలని కోరుతున్నాయి.
పలు వృత్తి విద్యాకోర్సుల ఫీజుల పెంపుపై టీఏఎఫ్‌ఆర్సీ చర్చించింది.
కరోనా నేపథ్యంలో ఫీజులను భారీగా కాకుండా నామమాత్రంగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.