Homeవిద్య & ఉద్యోగంజీతాలు ఇవ్వడం లేదు.. అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తున్న‌రు

జీతాలు ఇవ్వడం లేదు.. అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తున్న‌రు

హైద‌రాబాద్ః రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపకులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TSTCEA) రాష్ట్ర అధ్యక్షులు అయినేని. సంతోష్ కుమార్ అన్నారు.

ఈ మేర‌కు గురువారం ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి పిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. దీనితో అధ్యాపకుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిద‌న్నారు.

కళాశాలలో అధ్యాపకుల విద్యార్థి నిష్పత్తి లేదు, గ్రూప్ ఏక్సిడెంట్ పాలసీ అసలే లేదన్నారు. బ్యాంక్ లోన్లు కట్టుకోవడం కష్టంగా మారిందని అధ్యాపకులు రిజిస్ట్రార్ గారితో వాపోయారు.

ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలలో (ఎంబిఎ, ఇంజనీరింగ్, ఫార్మసీ ఎంసిఎ..)పనిచేస్తున్న అధ్యాపకులకు కరోనా పరిస్థితులలో గత కొన్ని నెలలుగా (5-8నెలలు) జీతాలు చెల్లించడం లేదనిరిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు.

రంగారెడ్డి జిల్లా మల్లాపూర్,బాలాపూర్ లో ఉన్న విద్యదాయిని, టీఎంఎస్ఎస్ కళాశాల‌లు ఫ్యాక‌ల్టీని వేధింపుల‌కు గురిచేస్తున్నాయ‌ని అయినేని అన్నారు.

ఏఐసీటిఈ నిబంధనల ప్రకారం గ్రూప్ ఏక్సిడెంట్ పాలసీ, మెటర్నిటీ సెలవులు ఉండాలి కానీ అవు ఎక్కడ అమలు పరచడం లేదు. ఈపీఎఫ్/ఈఎస్ఐ అసలే లేదన్నారు.

తెలంగాణ విద్య హక్కు చట్టం 1982, సెక్షన్ 79 ప్రకారంగా అధ్యాపకులందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అధ్యాపకుల జీతాలు విషయం లో సీబీఐ, ఐటి శాఖ అధికారులతో తనిఖీ లు చేయించాలని కోరారు.

రిజిస్ట్రార్ గారు స్పందించి ఉస్మానియ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో అధ్యాపకులకు జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధ్యాపకుల వసతుల కల్పనలో,నాణ్యమైన విద్య విజయంలో మేము ఎక్కడ రాజీ పడేది లేద‌ని రిజిస్ట్ర‌ర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్న‌ట్లు అయినేని చెప్పారు.

అధ్యాపకులకు జీతాలు చెల్లించ‌ని కాలేజీల‌కు త్వ‌ర‌లోనే నోటీసులు పంపిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చిన‌ట్లు అయినేని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కె. రాజు, కార్యదర్శి నరేష్, సురేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img