HomeEducationEducation : కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్

Education : కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్

పెద్దపెద్ద చదువులు చదివినా యువతకు తగినంతగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. దీంతో వృత్తివిద్యకు అధిక ప్రాధాన్యమిచ్చేందుకు విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు మొగ్గుచూపుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో అధిక ఉద్యోగాలు, అత్యధిక వేతనాలే ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా అదే రీతిలో ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. గతేడాది కన్వీనర్ కోటాలో బీటెక్ సీట్లు 84 వేలు ఉండగా..అందులో దాదాపు 57 వేలు కంప్యూటర్ సైన్స్ సీట్లే. ఇంకా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లోని సీట్లు కలిపితే ఆ సంఖ్య ఎక్కువే ఉంటుంది. మొత్తంగా 75 శాతం కంప్యూటర్ సైన్స్ సీట్లే అందుబాటులో ఉంటున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని సీట్లు పెరిగుతాయని అంచనా. మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రాధాన్యత తగ్గినట్లు తెలుస్తోంది. డిగ్రీలోనూ క్రమంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులు పెరుగుతున్నాయి. ఈ పరిణామం భారతదేశ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా కోర్సుల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పరిశోధలను పెద్ద మొత్తంలో ప్రోత్సహించాలి.

Recent

- Advertisment -spot_img