Homeహైదరాబాద్latest Newsచెరువు శిఖం భూముల్లో బావి తవ్వకం పై గంధరగోళం.. అధికారుల నిర్లక్ష్యమే అని స్థానికుల ఆరోపణలు

చెరువు శిఖం భూముల్లో బావి తవ్వకం పై గంధరగోళం.. అధికారుల నిర్లక్ష్యమే అని స్థానికుల ఆరోపణలు

ఇదే నిజం, ముస్తాబాద్: మొర్రపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల రేగుల చెరువులో రెండు వ్యవసాయ బావులను తవ్వి ఆ మట్టితో చెరువును పూడుస్తున్నా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మాజీ సర్పంచ్ దేవేందర్ వినతి పత్రం అందచేయగా, చెరువు శిఖం భూముల రెండు బావులు తవ్వడం వల్ల పక్కనే గ్రామానికి సంబంధించిన మంచినీళ్ల బావి ఉన్నది ఆ బావి నుండి రెండు గ్రామాలకు మంచినీళ్లు వాడుకుంటామని వాల్టా చట్ట ప్రకారం బావి పక్కన బావి తవ్వరాదని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బావులు తవ్వుతున్నాడని చెరువు భూమి చదును చేస్తున్నాంగా గ్రామానికి సంబంధించిన మంచినీళ్ల పైపులైను పగిలినాయి గ్రామాలకు మంచినీరు అందించే బావి భవిష్యత్తులో ఎండిపోయే ప్రమాదం ఉందని చెరువులో శిఖం భూమిలో తవ్విన ఆ రెండు బావులను సీజ్ చేసి వట్టి బావుల తవ్విన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ బుక్య దేవేందర్ కోరారు.. ఇదే విషయం పై బావులు తవ్విన సంబంధిత భూక్యా కపూర్ నాయక్ మాట్లాడుతూ. పట్టా ఉన్న భూమి లోనే బావులు తవ్వడం జరిగింది అని, కేవలం వ్యక్తి గత కక్ష తో సదరు వ్యక్తి ఇలాచేస్తున్నాడని ఆరోపించారు ఏది ఏమైనా సంబంధిత శాఖ అధికారులు క్షేత్ర స్థాయి లో ధర్యాప్తు చేసి సమస్య ను సద్దుమనిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img