Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర అవతరణ వేడుకలు హోరాహోరీ.. పోటాపోటీగా నిర్వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!

రాష్ట్ర అవతరణ వేడుకలు హోరాహోరీ.. పోటాపోటీగా నిర్వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా నిర్వహించనున్నాయి. రెండు పార్టీలు రాష్ట్ర అవివర్భావ వేడుకల నిర్వహణను ప్రతిష్టా తకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రోజే వేడుకలను నిర్వహిస్తుండగా.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు సంబురాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం జూన్ 2న ఉదయం పరేడ్ గ్రౌండ్స్ వద్ద, సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న వేడుకలకు చీఫ్ గెస్టుగా ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా హాజరుకానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు గనార్కులో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి సీఎం హాజరై జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్య క్రమాలు ఉంటాయి.

అదే వేదికపై ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు. వేడుకల్లో సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేసి ఫొటో సెషన్లో పాల్గొంటారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరగనున్నాయి. అక్కడ తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్లకు చేరుకొని అక్కడి స్టాల్స్ ను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారు లతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తా రు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత సుమారు 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ప భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ వాక్ జరుగుతుం డగా 13.30నిమిషాల ‘జయ జయహే తెలంగాణ’ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేయనున్నారు. కవి అందెశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణిని సన్మానించనున్నారు. రాత్రి 8.50 గంటలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ తీరాన పటాకులు కాల్చి వేడుకలను ముగించనున్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి ఇప్పటికే కలెక్టర్లను ఆదేశిం చారు. పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న వేడుకలు, సభకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. సుమారు 20 వేల నుంచి 25 వేల మంది వరకు ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు అంచనా. వేడుకల హాజరయ్యే 1,860 మంది వీవీఐపీలు, 11 వేల మంది జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

బీఆర్ఎస్..తగ్గేదేలే ..
సర్కారు జరిపే ఉత్సవాలకు దీటుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను దశాబ్ది ఉత్సవాల ముగింపు పేరుతో బీఆర్ఎస్ సైతం ఘనంగా నిర్వహించ నుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి జూన్ 3 వరకు మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణభవన్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోనున్నారు. వారి త్యాగాల ను గుర్తు చేసుకోనున్నారు. నేడు గన్పార్కులోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అమరజ్యోతి వరకు రాత్రి 7 గంటలకు బీఆర్ఎస్ ని నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. జూన్ 2 ఆదివారం రోజున దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లో తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అమరుల కుటుంబాలను సత్కరించనున్నారు. అదేరోజు హైదరాబా డ్లో పలు దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయను న్నారు. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిం చునున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. ఆయా జిల్లాల్లోని దవాఖానలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img