HomeరాజకీయాలుCongress and BRS are together Congress,BRS​ దొందు దొందే : Bandi Sanjay

Congress and BRS are together Congress,BRS​ దొందు దొందే : Bandi Sanjay

– అంతా ఒక్కటై తమపై దాడులకు దిగుతున్నారు
– తెలంగాణలో అధికారం మాదే
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్, బీఆర్​ఎస్​ దొందు దొందే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అన్నారు. ఆదివారం బండి విలేకరులతో మాట్లాడుతూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం ఎప్పుడూ కలిసే ఉంటాయన్నారు. ఢిల్లీలో ఈ పార్టీల నేతలంతా కలిసి మీడియా సమావేశం కూడా పెట్టారన్నారు. వారంతా కలిసి బీజేపీని టార్గెట్​ చేసి, తమపై దాడులకు దిగుతున్నారన్నారు. 2014 తర్వాత 2018లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్​ పైనే ఆధారపడి ఉందన్నారు. అందుకే కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన పథకాలతో తాము తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img