అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు రుణ మాఫీపై తాజాగా సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు నిధులను చెల్లించనున్నట్లు సమాచారం.
2023 డిసెంబర్ 7కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.2లక్షల లోపు రుణాలు రూ. 28 వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఒకే సారి రూ.20 వేల కోట్లను నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లోకి మళ్లించాలని ప్రభుత్వం ఆలోచన.