Homeతెలంగాణమహిళలకు కాంగ్రెస్​ పెద్దపీట

మహిళలకు కాంగ్రెస్​ పెద్దపీట

– కాంగ్రెస్​ నేత బడికె ఇందిర

ఇదే నిజం, జనగామ: కాంగ్రెస్​ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్​ నేత బడికె ఇందిర పేర్కొన్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోందని గుర్తు చేశారు. ఈ పథకం అమలుపై ఆమె జనగామ డిపో మేనేజర్​ జోత్స్నతో మాట్లాడారు. ఆర్టీసీలో బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం యావత్ మహిళా లోకం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు వంగాల కల్యాణి, సుంకరి నిర్మల, జనగామ మండల మహిళా అధ్యక్షురాలు కాముని జయ, అండాలు, గాడిపెల్లి సక్కు బాయి, కుకట్ల సుజాత తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img