Homeసినిమాకాంగ్రెస్ రావడం ఆనందంగా ఉంది

కాంగ్రెస్ రావడం ఆనందంగా ఉంది

– సినీ పరిశ్రమను ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది

– ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం సినీ రంగ సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయన్నారు. ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img