HomeరాజకీయాలుBJP విజయానికి Congress కారణం

BJP విజయానికి Congress కారణం

– కేంద్రంలో సపోర్ట్​ చేస్తూ.. నాపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు
– ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటుతాం
– ఎంఐఎం అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌ వల్లే బీజేపీ కేంద్రంలో గెలుస్తున్నదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్​ పార్టీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ విజయానికి తాను ఎలా బాధ్యుడిని అవుతానని, కాంగ్రెస్​ పార్టీయే బీజేపీ విజయానికి కారణమని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఆర్​ఎస్​ఎస్​తోనే మొదలైందని, గాంధీభవన్‌ రిమోట్‌ ఇప్పుడు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ మోహన్​భగవత్‌ చేతిలో ఉందన్నారు. ఏదిఏమైనా బీజేపీతో తన పోరాటం కొనసాగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం.. హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని నిలిపిందన్నారు. కానీ ఈ సారి జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, తిరిగి స్థానాలన్నీ తిరిగి కైవసం చేసుకుంటామన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img