Homeరాజకీయాలుకాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

– ‘అభయ హస్తం’ పేరుతో విడుదల చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
– ఆరు గ్యారంటీలతో పాటు మరో 36 అంశాలు
– కళ్యాణ మస్తు కింద ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష, 10 గ్రాముల బంగారం
– 18 ఏండ్లు దాటిన చదువకునే యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు
– జాబ్ వచ్చే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి
– ధరణి స్థానంలో భూమాత పోర్టల్
– రాష్ట్రంలో బెల్ట్ షాప్​ల రద్దు

ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజైంది. ‘అభయ హస్తం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్​లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు 36 అంశాలను అందులో చేర్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ లాగా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్‌‌ను కూడా హస్తం పార్టీ విడుదల చేసింది. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్ 1, 2024లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ కాంగ్రెస్​కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’అని తెలిపారు.

కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు


–ఆరు గ్యారంటీలు
– రూ.4 వేల నిరుద్యోగ భృతి
– మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
– 18 ఏళ్లు దాటి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు
– ఎస్సీ రిజర్వేషన్ల పెంపు
– బెల్ట్ షాపులు రద్దు
– తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం, గౌరవ భృతి
– వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.
– 3 లక్షల వడ్డీ లేని పంట రుణం.
– తొలి కేబినెట్‌లో మెగా డీఏస్సీ
– స్టూడెంట్లకు ఫ్రీ ఇంటర్​ నెట్
– ధరణి స్థానంలో భూమాత పోర్టల్..
– 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
– పసుపు బోర్డు ఏర్పాటు
– ఆటో డ్రైవర్లకు ఏడాది రూ.12 వేలు

Recent

- Advertisment -spot_img