Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల, యువతకు 30 లక్షల ఉద్యోగాలు!

కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల, యువతకు 30 లక్షల ఉద్యోగాలు!

Congress Manifesto : పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ న్యాయపత్ర్ పేరుతో దిల్లీలో మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. సామాజిక ఫథకాలతో పాటు 25 గ్యారంటీలు హామీగా పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని పేర్కొన్నారు. అగ్నివీర్ స్కీంను రద్దు చేస్తామన్నారు. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై మ్యానిఫెస్టో రూపొందించినట్లు మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం పేర్కొన్నారు.

> వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు : ఖర్గే

>దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ : ఖర్గే

>దేశవ్యాప్తంగా కులగణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు : ఖర్గే

>మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబానికి ఏడాదికి రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం : ఖర్గే

> కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తాం : ఖర్గే

> మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది : ఖర్గే

> కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ : ఖర్గే

>పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తాం : ఖర్గే

> గతంలో కాంగ్రెస్ అభివృద్ధి చేసింది. మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధిని కొనసాగిస్తాం : ఖర్గే

Recent

- Advertisment -spot_img