Homeహైదరాబాద్latest News6న కాంగ్రెస్ మ్యానిఫెస్టో రిలీజ్

6న కాంగ్రెస్ మ్యానిఫెస్టో రిలీజ్

BREAKING : రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ నెల 6 న తుక్కుగూడలో జరగనున్న సభ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభకు హాజరవనున్నట్లు రేవంత్ తెలిపారు. జాతీయ స్థాయి హామీలను ప్రకటించనున్నట్లు చెప్పారు. 6న సాయంత్రం 5 గంటలకు మ్యానిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాన్నారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌కు రైతులు గుర్తొచ్చేలా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాాదాలు తెలిపారు.

> పార్లమెంట్ ఎన్నికలు లేకుంటే కేసీఆర్ బయటికి వచ్చేవారు కాదు : రేవంత్ రెడ్డి

> గతంలో మేం ప్రజా సమస్యలపై పోరాడకుండా కేసీఆర్ నిర్బంధం చేశారు : Revanth

> భారాస డబ్బు వేల కోట్లు ఉంది. రైతులకు సాయం చేయొచ్చు కదా : Revanth

> కేసీఆర్, ఆయన కుటుంబం, కులం రాష్ట్రాన్ని దోచుకున్నారు : PCC Chief Revanth Reddy

> June 9న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది : రేవంత్ రెడ్డి

> కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్ అంటోంది. అంటే మిగతా సీట్లు బీజీపీకే కదా..పరోక్షంగా బీజేపీ కి మద్దతు ఇచ్చినట్లే కదా : రేవంత్ రెడ్డి

> మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక లాంటిది. వెన్నెముక విరిగినంక ఇంకేముంది : రేవంత్ రెడ్డి

Recent

- Advertisment -spot_img