ఇదే నిజం, ఖమ్మం : ఖమ్మంకు చెందిన ఓ మహిళ ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చింది. ఈ సమయంలో అక్కడ రాంబాబు అనే కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. కేసును అడ్డం పెట్టుకొని రాంబాబు సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మహిళ తనకు పలు ఆర్థిక సమస్యలు ఉన్నట్లు కానిస్టేబుల్కు తెలిపింది. దీంతో రాంబాబు చైన్ మార్కెట్ వ్యాపారం అంటగట్టి మహిళకు డబ్బులు వస్తాయని ఆశ చూపాడు. రాంబాబు మాటలు నమ్మిన మహిళ అతనిని సాన్నిహిత్యంగా ఉండసాగింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఆమెపై నిఘా పెట్టాడు. ఈ క్రమంలో భార్య కానిస్టేబుల్ తో ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. కానిస్టేబుల్ రాంబాబుపై ఖమ్మం సీపీకి ఆ మహిళ భర్త ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు ఆ మహిళపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేసి కేసు విచారణ చేపట్టాలని బాధితుడు పోలీసులను కోరాడు.