Homeహైదరాబాద్latest Newsకానిస్టేబుల్ కుటుంబానికి 8 లక్షలు అందజేత

కానిస్టేబుల్ కుటుంబానికి 8 లక్షలు అందజేత

ఇదే నిజం, మంచిర్యాల జిల్లా : ఇటీవల అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ మధు కుటుంబాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరామర్శించారు. రూ. 8 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మధు భార్య లతకు అందజేశారు. కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇతర బెనిఫిట్లు త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్ , ఆర్ఐ అడ్మిన్ దామోదర్, ఆర్ఐ హోం గార్డ్స్ మల్లేశం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సూపరింటెండెంట్ సంధ్య పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img