ఇదేనిజం, ఎండపల్లి : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులు పునః ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని వినయ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు లక్కాకుల రాణి – శ్రీనివాస్, గాజుల మల్లేశం స్థానికులు ముక్తి చందు, కొయ్యడ ఓదెలు, ఉష్కమల్ల మల్లేశం, కోట శ్రీశైలం, చింతల కిషన్, మెరుగు గోపాల్, ఉప్పు రాజయ్య, ఆకుల మధు, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.