Homeసినిమాచిరంజీవిని చూసి యాక్టింగ్​ను కంటిన్యూ చేస్తున్నా..

చిరంజీవిని చూసి యాక్టింగ్​ను కంటిన్యూ చేస్తున్నా..

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేశ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీకి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్​గా ‘వెంకీ 75’ పేరుతో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్​కు ఎంతోమంది ప్రముఖ సినీ నటులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరై ఆకట్టుకున్నారు. అయితే, ఈవెంట్​లో విక్టరీ వెంకటేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే సినిమాలు మానేసి, హిమాలయాలకు వెళ్లి ఉండే వాడిని అంటూ చెప్పుకొచ్చారు. 9 సంవత్సరాల తర్వాత విరామం నుండి తిరిగి వచ్చిన చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ అందించడం చూసి, ఈ నటన కొనసాగించాలని తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. వెంకీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img