పారిస్ ఒలింపిక్స్‌లో జెండర్ వివాదంలో ఇరుక్కున్న అల్జీరియా మహిళా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ స్వర్ణ పతకం గెలుచుకున్నది. వెల్టర్‌వెయిట్ క్యాటగిరీ ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ యాంగ్ లియూను ఓడించింది. ఫైనల్లో ఏకపక్ష నిర్ణయంతో ఖాలిఫ్ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నది. బాక్సింగ్ స్వర్ణ పతకం గెలుచుకున్న మొదటి అల్జీరియన్ మహిళా బాక్సర్‌గా ఆమె పేరుగాంచింది.