Coolie movie : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ”కూలీ” సినిమాలో (Coolie movie) నటించాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి భారీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ తేదిని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానుంది ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, అలాగే బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే అదే రోజు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన ”వార్ 2” సినిమా కూడా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో రెండు సినిమాలుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు విడుదల కావడంతో బాక్సాఫీస్ విధ్వంసమే అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి పోటీలో ఎవరు గెలుస్తురో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.